‘మా’ పోటీలోకి హేమ కూడా !

మూడ్నెళ్ల ముందు నుంచే ‘మా’ ఎన్నికల హీట్ మొదలైంది. సెప్టెంబర్ లో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయ్. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచి విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీలోకి వచ్చారు. త్రిముఖ పోటీ రసవత్తరంగా ఉండబోతుంది అనుకుంటున్న తరుణంలొ.. నటి హేమ కూడా పోటీలోకి వచ్చారు. దీంతో.. ఈక్వేషన్లు మారిపోనున్నాయి.

జీవిత రంగంలోకి దిగడంతోనే ఆమెను కట్టడి చేయడానికే హేమను రంగంలోకి దింపారని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఆ వర్గం ఓట్లు మరింతగా చీల్చేందుకు మరో ఒకరిద్దరని కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్. నరేష్ సపోర్ట్ తో పోటీలో ఉన్న మంచు విష్ణు ఓట్ బ్యాంక్ మాత్రం చీలిపోకుండా చూసుకుంటున్నారు. మొత్తానికి.. ఈ సారి మెగా మద్దతుతో పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్ కు కష్టంగానే కనిపిస్తోంది.