ఆ రోజునే ‘కేజీఎఫ్ 2’ రిలీజ్.. కానీ ఓ కండీషన్ !

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీఎఫ్’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ ఈ సినిమాకి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందని చెప్పుకొంటున్నారు.

వాస్తవానికి జూలై 16నే కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఉదృతి తగ్గడం.. పరిస్థితులు చక్కబడటంతో.. కేజీఎఫ్ 2 రిలీజ్ కోసం చిత్రబృందం కసరత్తు చేస్తోంది. చిత్రబృందం వినాయకచవితి మీద కన్నేసినట్లు తెలుస్తోంది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలిసింది. అదీకూడా అప్పటి వరకు దేశంలో థర్డ్ వేవ్ విజృంభణ మొదలు కాకుంటేనే. త్వరలోనే కేజీఎఫ్ 2 రిలీజ్ పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వనుంది.