పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది : లోకేష్

పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఐతే ఏపీ సర్కారు వైఖరిపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కోటి రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీలో పరీక్షల రద్దు బాధ్యత తాను తీసుకుంటా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం అందోళన చెందవద్దని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్ చేశారు.

“విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.మెంటల్ మామ కొమ్ములు వంచి పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది. దేశ వ్యాప్తంగా తుగ్లక్ నిర్ణయాల గురించి చర్చ జరుగుతుంది. థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం ప్రమాదం. పరీక్షలు రద్దు నిర్ణయాన్ని ప్రకటించే వరకూ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాను” అంటూ లోకేష్ ట్విట్ చేశారు.