ఒకటి థమన్ లాక్కున్నాడు

‘ఆర్ఆర్ఆర్’ కథానాయకుల తదుపరి సినిమాలు ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ఇక రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఉండనుంది. అయితే ఈ రెండు చిత్రాలకు కూడా ఒకే సంగీత దర్శకుడు పని చేయనున్నాడు. ఈ గొప్ప అవకాశాలని అనిరుధ్ కొట్టేశారనే వార్తలు వినిపించాయ్. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఇందులో నుంచి ఓ సినిమాని థమన్ లాక్కున్నారట. 

శంకర్-సినిమా కోసం అనిరుద్, థమన్ లలో ఒకరిని తీసుకోవాలనే ఆలోచన చేశారట. ఫైనల్ గా థమన్ ని తీసుకున్నారని తెలిసింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శంకర్ తన సినిమాల్లో పాటలకు పెద్దపీఠ వేస్తారు. కోట్లు ఖర్చు పెట్టి వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇక నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది థమన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది. ఇక తారక్, చరణ్ తదుపరి చిత్రాల్లో ముందుగా తారక్ సినిమా సెట్స్ (ఆగస్టులో) మీదకు వెళ్లనుంది. చరణ్ సినిమా ఇంకాస్త ఆలస్యం కానుందట.