APలో 4,458 కేసులు, 38 మరణాలు
ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,458 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 6,313 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 909 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు.