లింగుస్వామిపై ఓ ఫిర్యాదు
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో లింగుస్వామి ఒకరు. కానీ అది ఒకప్పుడు. వరుస ప్లాపులతో ఆయనకు అవకాశాలు తగ్గాయ్. అలా పక్కన ఉండిపోయారు. మెల్లగా తెలుగు హీరోలని ట్రై చేస్తే.. హీరో రామ్ ఓకే చెప్పేశారు. ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ కూడా అయిపోయింది. రామ్ కి బాగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడూ.. సెట్స్ మీదకు వెళ్దామా ? అనే ఉత్సాహంతో ఆయన ఉన్నారు. ఇంతలో లింగుస్వామికి షాక్ తగిలింది. ఆయనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఓ ఫిర్యాదు నమోదైంది.
తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. తనకు లింగుస్వామికి వున్న పాత లెక్కలు తేల్చాలని, తన దగ్గర అన్ని కాగితాలు వున్నాయని, తనకు లింగుస్వామికి వున్న లెక్కలు తేలే వరకు వేరే సినిమాల వ్యవహారాలు పక్కన పెట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రామ్-లింగుస్వామిల సినిమా సెట్స్ మీదకు వెళ్లడం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.