డెల్టా వేరియంట్.. అత్యంత ప్రమాదకరం !
దేశంలో కరోనా ఉదృతి తగ్గింది. దీంతో కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడినట్టేనని ఆనందపడేలోగా.. కొత్తరకం వేరియంట్స్ గురించి వస్తున్న వార్తలు భయాన్ని కలిగిస్తున్నాయి. వేగంగా వ్యాపించే స్వభావమున్న డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఇప్పటివరకు 85 దేశాలకు ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
డెల్టా కంటే ముందు వేగంగా ప్రబలిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను కూడా ‘ఆందోళనకర వేరియంట్లు’గా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్రస్తుతం అల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. ఆల్ఫా కంటే డెల్టా 1.23 రెట్లు వేగంగా ప్రబలుతున్నట్టు జపాన్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. డెల్టా బాధితుల్లో ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరిక, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్‌లో జరిపిన మరో అధ్యయనం పేర్కొంది.