Delta Plus.. ఇజ్రాయెల్‌ అప్రమత్తం !

కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇజ్రాయెల్ చాలా త్వరగా భయటపడింది. ఆ దేశ జనాభా చాలా కావడంతో చాలా త్వరగా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొంది. అదే సమయంలో కేసులు తగ్గడంతో.. ఇన్‌డోర్‌ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ వైరస్‌ ఉద్ధృతి వేగవంతమవ్వడంతో బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసింది.

ఆ దేశ ఆరోగ్య శాఖాధికారి నాచ్‌మన్‌ యాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రపంచం మొత్తంలో ఇజ్రాయెల్‌ వేగవంతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతున్న దేశంగా నిలిచింది. అయినప్పటికీ రోజుకు వందకు పైగా డెల్టా వేరియంట్‌ కేసులు నమోదవ్వడం ఆందోళనకరంగా మారింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగడం అందరినీ కలవరపెడుతోంది. కాబట్టి తిరిగి మాస్కులు ధరించడం ప్రారంభించాలి” అని అన్నారు.