‘పుష్ప’ హిందీ డబ్బింగ్ రైట్స్.. రేటు ఎంతో తెలుసా ?

బన్నీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. పుష్ప రెండు భాగాలుగా పాన్ ఇండియా సినిమా తీసుకొస్తున్నారు. ఇప్పటికే తొలిభాగం హిందీ డబ్బింగ్ రైట్స్ ను అమ్మేసినట్టు తెలుస్తోంది. రూ. 17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలిసింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సినిమాగా ‘పుష్ప’  తయారువుతోంది. ఇలాంటి సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ కు క్రేజ్ ఎక్కువ వుంటుంది. మరో ఒకటి రెండు కోట్లు ఎక్కువే వచ్చే అవకాశం వుంది అంటున్నారు. ఇక బాలయ్య-బోయపాటిల హ్యాట్రిక్ చిత్రం అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 15కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారమ్.