తీరని కోరికలని తీర్చుకుంటోంది

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తీరని కోరికలని తీర్చుకుంటోంది. తమన్నా మంచి నటి. కానీ ఆమె అందం.. ఆమె నటనని ఇన్నాళ్లు డామినేట్ చేస్తూ వస్తోంది. ఇన్నాళ్లు ఆమెని గ్లామర్ పాత్రలో ఎక్కువగా పలకరించాయ్. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలోనూ ఆమె అందాలనే హైలైట్ చేశారు. ఇక మిగితా సినిమాల్లోనూ తమ్మూని అందంగా చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆమెలోని నటన విశ్వరూపాన్ని బయటికి తీసే ప్రయత్నం పెద్దగా చేయలేదు.

ఇప్పుడు.. ఓటీటీల హవా మొదలవ్వడంతో తమన్నాకు వరుసగా వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే 2 వెబ్ సిరీస్ లు చేసిన తమన్న, ఇప్పుడు ముచ్చటగా మూడో సిరీస్ కు ఓకే చెప్పింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది మిల్కీబ్యూటీ. దీనికి “యారీ దోస్తీ” అనే టైటిల్ అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్న నెగెటివ్ షేడ్స్ కలిగిన లవర్ పాత్రలో కనిపించబోతోంది. నటన స్కోప్ ఉన్న పాత్ర అని చెబుతున్నారు.

ఓటీటీ వేదికగా తమ్మూ.. తనలోని తీరని కోరికలని తీర్చుకుంటుంది. నటిగా తనేంటో ? వెబ్ సిరీస్ ల ద్వారా నిరూపించుకొనే అవకాశం తమ్మూకి దక్కింది. ఇప్పటి వరకు చేసిన రెండు వెబ్ సిరీస్ లోనూ తమ్మూ నటన హైలైట్. ఇప్పుడు ఏకంగా ఆమె నెగటివ్ షేడ్ లోకి మారబోతుంది. కచ్చితంగా నటిగా తమ్మూకి ఇదో మంచి అవకాశం. ఇలా.. ఓటీటీ వేదికగా తమ్మూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.