డెల్టా ప్లస్‌.. తమిళనాడులో తొలి మరణం !

కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 45 వేల నమూనాలను పరీక్షించగా.. వాటిలో 51 డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం కేసుల్లో మహారాష్ట్రలో 22, తమిళనాడుతో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు చొప్పున, అంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు డెల్టా ప్లస్‌ వైరస్‌ సోకి మృతి చెందారు.  తాజాగా తమిళనాడుకూ పాకింది. ఈ రకం వైరస్‌తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ధ్రువీకరించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ తెలిపారు.