Delta plus ఎఫెక్ట్.. మళ్లీ కఠిన ఆంక్షలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే Delta plus కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 45వేల జన్యు నమూనాలలో, కోవిడ్ -19 డెల్టా ప్లస్ వేరియంట్లు 12 రాష్ట్రాల్లో నమోదయ్యాయని, మొత్తం 51మంది బాధితులకు డెల్టా ప్లస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

ఇందులో 22 కేసులు మహారాష్ట్ర నుంచి రాగా.. డెల్టా ప్లస్ కేసులు తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7, కేరళలో 7, పంజాబ్‌లో 3, గుజరాత్‌లో 2, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా మరియు కర్ణాటకలలో ఒకటి నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కేసులు తగ్గినా.. సడలింపులు చేయట్లేదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం ఇప్పటికే నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వెయ్యాలని, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకుంది.