‘క‌న‌బ‌డుట‌లేదు’ టీజర్ టాక్

సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం ‘క‌న‌బ‌డుట‌లేదు'. ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌.. ఇలా సాగే క‌థ ఇది. పోలీసుల‌కు అంతుప‌ట్ట‌ని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌ది చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.

సునీల్ ఈమ‌ధ్య కొత్త త‌ర‌హ ఆపాత్ర‌లు చేస్తున్నాడు. విల‌న్ గానూ మెప్పిస్తున్నాడు. త‌న‌కు ఇది కొత్త అనుభ‌వ‌మే. నేర ప‌రిశోధ‌న చిత్రాలు ఎలా ఉంటాయో.. ఆ ఫార్మెట్ లోనే క‌నిపించింది. టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… అన్నీ బాగున్నాయి.