దారుణం : కత్తి మహేష్ కు ప్రమాదం.. దేవుడు వేసిన శిక్ష!

శత్రువైనా ప్రాణాలు పోతున్నాయంటే కాపాడే సంస్కృతి మనది. అలాంటిది ఓ నటుడికి ప్రమాదం జరిగి.. తీవ్ర గాయాలు అయితే.. కామెడీ చేయడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు కత్తి మహేష్ విషయంలో ఇదే జరుగుతోంది.

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కారు.. వేగంగా ఎదురుగాఉన్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. పూర్తిగా మహేష్ కూర్చున్న వైపు కారు మొత్తం తునాతునకలయింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.

నెల్లూరులోని ఆస్పత్రిలో మహేష్ కి చికిత్స అందించారు. ముక్కుకు ఆపరేషన్ చేశారు. ఇంకా కళ్లకు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే కత్తి మహేష్‌కు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత కొందరు పైత్యం చూపించారు. స్టార్ హీరోకు చెందిన అభిమానులు మహేష్ కు అది ‘దేవుడు వేసిన శిక్ష’ అని కామెంట్స్ పెట్టారు.

మహేష్ కు స్వల్ప గాయాలు అయ్యాయని ఉదయం చెప్పుకున్నారు. కానీ.. మధ్యాహ్నానికి ఆయనకు జరిగిన గాయాల… తీవ్రమైనవేనని చెబుతున్నారు. మహేష్ ప్రాణాలతో బయటపడొచ్చు. కానీ ఆయన బతికి ఉన్నంతకాలం ఇబ్బంది పడే పరిస్థితి. ఇలాంటి టైమ్ లోనూ వికృత చేష్టలు చేయడం ఎంత వరకు సమంజసం.