థర్డ్‌వేవ్‌లో అలాంటి పరిస్థితి తలెత్తకూడదు
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సీజన్ దొరక్క ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐతే ధర్డ్ వేవ్ లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలి. ఇందుకోసం కలిసి పనిచేయాలి. ఓ ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయాలని ఢిల్లీ సీఎం క్రేజీవాల్ పిలుపునిచ్చారు.
“థర్డ్ వేవ్‌లోనైనా ఎవరికీ ఆక్సిజన్ కొరత లేకుండా కలిసి ఓ వ్యవస్థను ఏర్పాటు చేద్దాం. రెండో దశలో మెడికల్ ఆక్సిజన్ కొరతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. థర్డ్‌వేవ్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదు. మనలో మనం పోట్లాడుకుంటే కరోనా విజయం సాధిస్తుంది. మనమంతా ఐక్యంగా పోరాడితే దేశం గెలుస్తుంది” అని క్రేజీవాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్ చేశారు.