దిల్ రాజుకు కొత్త బిరుదు

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ మీడియా కొత్త బిరుదు ఇచ్చింది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టడమే రీమేక్ తో అడుగుపెడుతున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా వరుసగా రీమేక్స్ చేస్తున్నాడు. ‘హిట్’ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. రాజ్ కుమార్ రావు హీరోగా బాలీవుడ్ హిట్ తెరకెక్కనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారు. 

తాజాగా మరో రీమేక్ కూడా ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో కలిసి నాంది సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. ఇవీగాక.. ఎఫ్ 2 బాలీవుడ్ రిమేక్ రైట్స్ కూడా దిల్ రాజు లిస్టులోనే ఉన్నాయ్. వరుసగా అరడజను తెలుగు సినిమాలని బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నాడు. అందుకే అందుకే బాలీవుడ్ మీడియా దిల్ రాజును ఇప్పుడు రీమేక్ రాజును చేసేసింది. మరీ.. రిమేజ్ రాజు బిరుదుపై దిల్ రాజు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి !