స్మార్ట్ సిటీ అవార్డ్స్-2020 లిస్ట్.. ఇదే !
‘స్మార్ట్ సిటీ మిషన్’ కింద ప్రతి యేడాది కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అవార్డ్స్ ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక కోణాలు, పాలన, సంస్కృతి, పట్టణ పర్యావరణం, పారిశుధ్యం, ఆర్థిక వ్యవస్థ, నిర్మించిన పర్యావరణం, నీరు, పట్టణ చైతన్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని స్మార్ట్ సిటీ అవార్డులను అందజేస్తారు.
2020కి గాను ఇండోర్ (మధ్యప్రదేశ్) మరియు సూరత్ (గుజరాత్) సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. 100 స్మార్ట్ సిటీలలో మొత్తం పనితీరు పరంగా ఈ రెండు నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి. స్మార్ట్ సిటీలుగా నగరాలను తీర్చిదిద్దడంలో ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. ఏడు నగరాలను సొంతంగా స్మార్ట్ సిటీలుగా చేసినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి బహుమతి లభించింది. మీరట్, ఘజియాబాద్, అయోధ్య, ఫిరోజాబాద్, గోరఖ్పూర్, మధుర-బృందావన్ మరియు సహారన్పూర్ నగరాలు స్మార్ట్ సిటీలుగా ఉన్నాయి.
ఇక ఉత్తమంగా పనిచేసే 9 నగరాకు 4స్టార్ రేటింగ్ ఇచ్చాయి. వీటిలో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, పూణే, విజయవాడ, రాజ్‌కోట్, విశాఖపట్నం, పింప్రి-చిన్చ్వాడ్ మరియు వడోదర ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ లీడర్‌షిప్ అవార్డుకు అహ్మదాబాద్, వారణాసి, రాంచీ ఎంపికయ్యాయి.