TSలో 1,028 కేసులు, 9 మరణాలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,028 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,19,865కు చేరింది.

24 గంటల వ్యవధిలో 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,627కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,489 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,01,184కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,054 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.