బ్రేకింగ్ : జులై1 నుంచి పాఠశాలలు తెరచుకోవడం లేదు
తెలంగాణలో పూర్థిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి విద్యాసంస్థలని తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కేజీ టు పీజీ క్లాసులని ప్రారంభించాలని ప్రకటన చేసింది. అయితే ఇప్పుడీ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. శనివారం ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్ లైన్ లోనే విద్యా బోధన కొనసాగించాలని, 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని వారు సీఎంకు విన్నవించారు. దానికి సీఎం కేసీఆర్ అంగీకరించారని పీఆర్టీయూ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరచుకోవడం లేదు.