కోమట్ రెడ్డి.. రియాక్షన్ ఏంటీ ?

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు ? ఉత్కంఠకి తెరపడింది. రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో రేవంత్ రెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డికి దగ్గా పోటీ ఇచ్చిన కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి అసలు పత్తాలేకుండా పోయింది. ఆయనకి ఇతర పదవి ఇవ్వలేదు. కనీసం ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు.

పీసీసీ పదవి ఇవ్వకుంటే కోమట్ రెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారం ఉంది. బీజేపీ లేదా టీఆర్ఎస్ లో ఆయన చేరతారు అనే మాటలు వినిపించాయి. ఇప్పటికే ఆయన తమ్ముడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. తమ్ముడితో పాటు వెంటట్ రెడ్డి కమలం పాట పాడతారా ? లేక పదవి రాకున్నా.. గుండె నిర్భరం చేసుకొని కాంగ్రెస్ లోనే ఉంటాడా ? అన్నది చూడాలి.

ఇక రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంపై కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ చంద్రబాబు మనిషి. ఆయనకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా ? అని వ్యాఖ్యానించారు రాజగోపాల్. అయితే పరిస్థితి మాత్రం రాజగోపాల్ చెప్పినదానికి భిన్నంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి పదవి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.

Komatireddy Rajagopal Reddy angry on Congress high committee and @RahulGandhi for giving TPCC president to #Revanthreddy pic.twitter.com/B4ZAP0ZhS6
— Srinivas Narayan (@srinivas_nar) June 26, 2021