కోమటిరెడ్డిపై వేటు వేస్తారా ?

పీసీసీ పదవి దక్కని కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పైర్ అయ్యారు. ఏకంగా హైకమాండ్ పైనే విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని.. ఓటుకు నోటు మాదిరిగా జరిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో కోమట్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ హైకమండ్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరాలు సేకరించింది. కానీ చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం.
వెంకట్ రెడ్డి సోదరుడు ఇప్పటికే బీజేపీ బాట పట్టారు. పీసీసీ ఇవ్వకపోతే తానూ బీజేపీకే పోతానన్న సంకేతాలను తరచూ గడ్కరీతో భేటీ అవడం ద్వారా కోమటిరెడ్డి కూడా పంపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ బ్లాక్‌మెయిల్‌కు లొంగినట్లుగా లేదు. రేవంత్ రెడ్డికి కిరీటం ప్రకటించింది. దాంతో కోమటిరెడ్డి రెచ్చిపోయారు. నేరుగా హైకమాండ్‌పైనే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కోమట్ రెడ్డిపై వేటు వేస్తేనే.. ఇతరులకు సందేశం పంపినట్లవుతుందని అంటున్నారు.