కళ్యాణ్ సినిమా కూడా రెండు పార్టులుగా ?

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. సినిమా లెంగ్త్ ఎక్కువైనా ఫ‌ర్లేదు. కావాలంటే రెండు భాగాలుగా విడుద‌ల చేద్దాం అంటున్నారు. ఇప్పటికే ‘పుష్ప’ రెండు పార్టులుగా రావడం ఖాయం అయింది.  ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ బింబిసార‌ కూడా రెండు భాగాలుగా రాబోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇది కూడా ఫుటేజీ పెర‌గ‌డం వ‌ల్ల‌.. తీసుకున్న నిర్ణ‌యం అని తెలుస్తోంది.

కానీ ఇక్కడ రిస్క్ కూడా ఉంటుంది. పార్ట్ 1 హిట్టైతేనే.. పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు. బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పార్ట్ 2 చూడ‌డానికి ప్రేర‌ణ క‌లిగించింది. ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. రెండు భాగాలుగా తీయడం ఎన్టీఆర్ బయోపిక్ కు మైనస్ అయింది. మరీ.. పుష్ప, బింబిసార  విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.