మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరోసారి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వైద్య వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు :

* టైర్‌ 2, 3 పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ

* ఉత్తర్‌ప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి

* వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయింపు

* కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ

* వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్ల కేటాయింపు

* ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు

* వైద్య, ఆరోగ్యశాఖకు సాయం చేసే సంస్థలకు అండగా ఉండాలని నిర్ణయించింది.