ఇది ‘దళిత కార్డ్ కాదు.. బీజేపీకి కౌంటర్ కార్డు’
ఆర్థికంగా బాగా చితికిపోయిన దళిత కుటుంబాలను.. ఉన్నత స్థాయికితీసుకొచ్చే లక్ష్యంతో ‘దళిత ఎంపవర్మెంట్’ పథకాన్ని తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నియోజకవర్గం నుంచి వంద కుటుంబాలు. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 11900 కుటుంబాలు. మొత్తంగా రూ. 1200కోట్లు డైరక్ట్‌గా ఎకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయనున్నారు.
ఈ పథకం వెనక సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాం దాగి ఉందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. ఆ పార్టీ బీసీ కార్డ్ ని ఎత్తుకుంది. బీసీలకు పెద్దపీట వేస్తోంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ దళితలని మోసం చేస్తున్నారని.. దళితుడిని మొదటి సీఎం చేస్తానని మాట తప్పారని విమర్శిస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
వారికి ఆ అవకాశం ఇవ్వొదనే సీఎం కేసీఆర్ ‘దళిత ఎంపవర్మెంట్’ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలోనే ఈ పథకం ఫలితాలని చూడాలి. అది 2023 ఎన్నికల వరకు ఫలితాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ముందుగా నియోజవర్గానికి ఓ వంద మందికి పది లక్షల సాయం చేస్తారు. ఆ వంద మంది తమ బతుకులు మారాయని గొప్పగా చెప్పుకుంటారు. కొన్నాళ్లు ఓపిక పడితే తమ బతుకులని సీఎం కేసీఆర్ మారుస్తారనే ఆశతో మిగితా వారు ఉంటారు. ఈ గ్యాప్ లో సీఎం కేసీఆర్ తన పూర్తి చేసుకుంటాడు. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పుకుంటున్నారు.