అందుకే తెలంగాణ ‘మా’ కోరుతున్నం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల్లో తెలంగాణ వాదం తెరపైకి వచ్చింది. తాను మా ఎన్నికల బరిలో నిలబడుతున్నట్టు సీనియర్ నటుడు cvl నరసింహా రావు ప్రకటించారు. తెలంగాణ వాదమే తన అజెండా. తెలంగాణ కోసం ప్రత్యేక మా అసోసియేషన్ ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మధ్య తరగతి, చిన్న కళాకారులు, తెలంగాణ కళాకారులకు న్యాయం జరగడం కోసం పోటీ చేస్తున్నట్టు తెలిపారు. cvl నరసింహా రావుకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సపోర్ట్ తెలిపారు.

ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికల బరిలో నిలవడంపై మరింత వివరణ ఇచ్చారు సివిఎల్ నరసింహారావు. తెలంగాణ కళా కారులు, వారి ఇబ్బందులే నా అజెండా అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సాహీతీ అకాడమి ఏర్పాటు చేశారు. తెలంగాణకు అధికార భాష సంఘం వేరే ఉంది. రెండు రాష్ట్రాలకు ఇద్దరు సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు. ఇరు రాష్ట్రాలకు ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు రెండు రాష్ట్రాలకు వేరు వేరుగా మా అసోసియేషన్స్ ఉంటే తప్పేంటీ అని ప్రశ్నించారు. అంతేకాదు.. 2009లోనే మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రిజిస్టర్ చేయించామని తెలిపారు.