కోమట్ రెడ్డి బ్రదర్స్ మధ్య విబేధాలు ?

తనకి పీసీసీ పదవి దక్కలేదు అనే కడుపుమంటతో ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో దిగగానే కాంగ్రెస్ అధిష్టానం, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు మాదిరిగానే పీసీసీ ఎంపిక జరిగిందన్నారు. అది టీ-కాంగ్రెస్ కాదు.. టీ-టీడీపీ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీ-టీడీపీ డిపాజిట్లు దక్కించుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. ఏకంగా అధిష్టానం పైనే వెంకట్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై చర్యలు తీసుకొంటారనే మాటలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతు మాట్లాడి షాక్ ఇచ్చారు. దీంతో  కోమట్ రెడ్డి బ్రదర్స్ మధ్య విబేధాలు ఉన్నాయనే విషయం బయటికి పొక్కింది. గతంలో రాజగోపాల్ రెడ్డి భాజాపాలో చేరుతానే ప్రకటన చేశారు. దానికి అన్న నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయ్. ఇటీవల పీసీసీ పోస్ట్ కు పోటీ పడుతున్న సమయంలోనూ.. అన్నాదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేంటీ ? అని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. అయితే కోమట్ రెడ్డి బ్రదర్స్ మధ్య విబేధాలకు కారణం ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది.