‘మా’కు భవనం లేదు.. కానీ అప్పుడే దాని పేరు.. పోరు !

మూడ్నెళ్ల ముందే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నికలు హీట్ మొదలైంది. ఈసారి కూడా ‘మా’కు సొంత భవనం ఎజెండాతోనే ఎన్నికలు జరగనున్నాయి. ‘మా’ భవనం కట్టాలంటే.. ముందుగా ప్రభుత్వం నుంచి స్థలం సంపాదించాలి. అలా చేస్తే పెద్దగా ఖర్చు లేకుండానే భవనం నిర్మించుకోవచ్చు. ఇది జరగాలంటే ప్రకాష్ రాజ్ నే కరెక్ట్. ఆయనకు తెలంగాణ ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు వున్నాయని చెప్పుకొంటున్నారు.

బయటికి రాని మరో విషయం ఏంటంటే.. ? ఈసారి మా భవనం ఒక్కటే ఎజెండా కాదట. దాని పేరు కూడా అని చెప్పుకుంటున్నారు. నూతనంగా కట్టబోయే మా భవనానికి ‘మెగాస్టార్’ పేరు పెట్టాలని మెగా క్యాంప్ భావిస్తుందట. అయితే తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన ‘నందమూరి తారకరామారావు’ పేరు పెట్టాలి అన్నది టాలీవుడ్ లోని మరో వర్గం ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి.. ఈసారి మా భవనం మాత్రమే కాదు.. దాని పేరు కూడా అజెండా మారనుంది.