బీజేపీపై మోత్కుపల్లి ఎటాక్

ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. కానీ పార్టీ లైన్ ని పాటించకుండా ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సమావేశానికి హాజరయ్యారు. అంతేకాదు.. సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ ది గొప్ప మనసు అంటూ కొనియాడారు. దీంతో బీజేపీ నేతలు మోత్కుపల్లిని టార్గెట్ చేయడం మొదలెటారు. ఆయన సంగతి తేల్చాలని కోరారు. మోత్కుపల్లి కారెక్కుతారా ? అంటూ మీడియా ప్రచారం చేసింది.

అఖిలపక్షం మీటింగ్ కు హాజరుకావడంపై తాజాగా మోత్కుపల్లి వివరణ ఇచ్చారు. తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతితోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘దళిత్ ఎంపవర్ మెంట్’ సమావేశానికి వెళ్లినట్లు స్పష్టం చేశారు. కొందరు నేతలు బండి సంజయ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని.. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను పోగొట్టేప్రయత్నం చేశానన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు.

మొత్తానికి పార్టీ లైన్ ని క్రాస్ చేయలేడు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతితోనే అఖిలపక్ష సమావేశానికి వెళ్లినట్టు వివరణ ఇచ్చేప్రయత్నం చేశారు మోత్కుపల్లి. అదే సమయంలో సీఎం కేసీఆర్ పై ఉన్న ప్రేమని మరోసారి బయటపెట్టారు. స్వయంగా కేసీఆర్ ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండగలనా ? అన్నారు. అంటే రేపు పార్టీలోకి రమ్మని సీఎం కేసీఆర్ ఫోన్ చేస్తే మోత్కుపల్లి జంప్ అన్నమాట. సీనియర్ నాయకుడిగా తన రాజకీయ చతురతని మోత్కుపల్లి ప్రదర్శిస్తున్నారు.