పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ లో జరిగిన పీవీ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్  26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పీవీకి నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పారు. పీవీ తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పీవీ ప్రజ్ఞ అమోఘమని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టారన్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Live: CM Sri KCR addressing the gathering at Sri <a href=”https://twitter.com/hashtag/PVNarasimhaRao?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#PVNarasimhaRao</a> Centenary Celebrations closing ceremony <a href=”https://t.co/mNhvrDzYOB”>https://t.co/mNhvrDzYOB</a></p>&mdash; Telangana CMO (@TelanganaCMO) <a href=”https://twitter.com/TelanganaCMO/status/1409402736244756484?ref_src=twsrc%5Etfw”>June 28, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>