వీహెచ్ ని పరామర్శించిన రేవంత్

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. ఆయన్ని కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. పీసీసీ పదవి దక్కిన రేవంత్.. వరుసగా సీనియర్ నేతలని కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్యలని ఆయన కలిశారు. ఈ క్రమంలో వీహెచ్ ని కలుద్దామని వెళ్లారు.
అయితే వీహెచ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలిసి.. వెళ్లి పరామర్శించారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. హాస్పిటల్ లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చర్చించారని తెలిపారు. పార్టీ అభివృద్ధి విషయానికి సంబంధించి వీహెచ్ కొన్ని సలహాలను ఇచ్చారని, సోనియాగాంధీ వద్దకు కలిసి వెళదామని చెప్పారని వివరించారు.