ShaliniPandey హాట్ & అమాయకం ఫోజులు

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది షాలినీ పాండే. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో.. షాలీనీ పాండే సూపర్ హిట్ అయింది. ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ వేటిని పడితే వాటిని చేయననే నో చెప్పింది. 118 లాంటి వైవిధ్య సినిమాని చేసింది. ఆ తర్వాత చేద్దామన్న షాలినీకి ఆఫర్లు రావడం లేదు.

ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతల చూపులు తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. తాజాగా హాట్ హాట్ ఫోటో షూట్ చేసినట్టుంది. దానికి సంబంధించి ఓ రెండు ఫోటోలని వదిలింది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్న షాలినీ పాండే హాట్ గా కనిపిస్తూనే అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.