#సిగ్గలేనివెధవవెల్లంపల్లి ట్రెండింగ్’లో !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి కాలితే ఏం చేయగలరో మరోసారి నిరూపించారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కి కాలింది. దీంతో సోషల్ మీడియా వేదికగా మంత్రి వెల్లంపల్లి పరువు తీసే పని పెట్టుకున్నారు.

‘సిగ్గలేని వెదవ వెల్లంపల్లి’హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్ విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో పవన్ టీషర్టును పబ్లిసిటీ కోసం లాంచ్ చేసిన వెల్లంపల్లి ఫొటోలను పెట్టి ఎద్దేవా చేస్తున్నారు. 420, 6093,36 అంటూ వెల్లంపల్లిపై మండిపడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకి వెల్లంపల్లి ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మరీ.. దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ? అన్నది చూడాలి.