బాలయ్యపై స్పెషల్ వీడియో.. అదిరింది !

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంకా చిన్నపిల్లాడే. ఆయనలో కల్మషం కనబడని చెబుతుంటారు. పలువురు సినీ ప్రముఖులు వేర్వేరు సందర్భాల్లో బాలయ్య గురించి గొప్పగా చెప్పిన విషయాలని కలిపి శ్రేయస్ మీడియా ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసింది. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో మొదలు కొని.. పూరి జగన్నాథ్, సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ.. ఎన్ టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న బాలయ్య గురించి గొప్పగా చెప్పడం చూడొచ్చు. చివరలో జై బాలయ్య అంటూ నినాదాలు హోరెత్తాయ్. ఆఖరులో అలీ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఆమ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్ బి కె అంటూ నవ్వులు పూయించారు. ఈ స్పెషల్ వీడియోను మీరు చూసేయండీ.. !
Special Video About Natasimha #NandamuriBalakrishna 🔥 by @shreyasgroup#NBK #ShreyasMedia pic.twitter.com/ddZMBbCcKA— BARaju’s Team (@baraju_SuperHit) June 28, 2021