విఘ్నేష్ కి నయన్ బోర్ కొట్టేసిందట.. ఇక పెళ్లి అయినట్టే !
కోలీవుడ్ ప్రేమజంట నయన్-విఘ్నేష్ ల పెళ్లి కబురు వచ్చేసింది. చాన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉంది. కలిసి తిరుగుతున్నారు. పార్టీలు, టూర్ లకి వెళ్తున్నారు. మరి పెళ్లెప్పుడు ? అంటే మాత్రం చెప్పడం లేదు. అయితే తొలిసారి విఘ్నేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇన్ స్టా వేదికగా ప్రేక్షకులతో ముచ్చటించిన విఘ్నేష్ నయన్ తో పెళ్లిపై స్పందించారు.
‘వివాహం ఖరీదైనది. ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత నయన్-విఘ్నేష్ ల పెళ్లి ఉంటుందని చెప్పుకుంటున్నారు. గతంలో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్.. ఇంకా నయన్ బోర్ కొట్టలేదు. ఆమె బోర్ కొట్టినట్టు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బహుశా.. ఇన్నాళ్లుకు నయన్ బోర్ కొట్టినట్టుంది. అందుకే పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టున్నాడు.