రకుల్ తో విశ్వక్ సేన్ నైట్ పార్టీ

యంగ్ హీరో విశ్వక్ సేన్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని పట్టేశాడు. ఆమెతో కలిసి నైట్ పార్టీ చేసుకుంటున్నాడు. ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31- లేడీస్ నైట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్ని ఊహించని పరిణామాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని విజయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తెరకెక్కిస్తున్నారు.

కథ ప్రకారం ఇందులో నలుగురు హీరోయిన్స్ ఉంటారు. నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ మౌనిక జాన్, మేఘా ఆకాశ్ లు నటిస్తున్నారు. వీరే కాకుండా ఓ కీలక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చివరి షెడ్యూల్ రకుల్ పాల్గొంటోంది. రకుల్, విద్యుల్లేఖ రామన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే రకుల్ తో కలిసి విశ్వక్ సేన్ కి సీన్స్ ఉంటాయట. వీరిద్దరు కలిసి రొమాన్స్ చేస్తారా ? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.