‘పుష్ప’ కీలక సీన్ లీక్

బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ ‘పుష’ గురించి రోజుకో విషయం బయటి లీకవుతోంది. సినిమాలో బన్నీ ఎర్ర చందనం రవాణా చేసే స్థాయి నుంచి మాఫియా లీడర్ గా ఎదుగుతాడని, తొలిభాగం అంతా రగ్డ్ గా, మలి భాగం అంతా స్టయిలిష్ గా వుంటుందని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా సినిమాలోని ఓ కీలక సీన్ బయటికి పొక్కింది.

అదే బన్నీ తన వేలుని నరుక్కోవడం. సినిమాలో బన్నీ అనుచరుడు ఒకడు చనిపోతాడట. అతగాడి తల్లికి కళ్లు కనిపించవట. అయితే కళ్లు లేని ఆ తల్లికి ఆ విషయం చెప్పలేక, హీరోనే కొడుకుగా నటిస్తుంటాడట. అయితే ఆ తల్లికి తన కొడుకు ను గుర్తు పట్టడానికి ఒకటే ఆధారం. ఓ చేతికి నాలుగు వేళ్లే వుండడం. అందుకోసం హీరో ఏకంగా ఓ వేలు త్యాగం చేస్తాడట. ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లే సీన్ ఇదని చెబుతున్నారు. ఇక పుష్పని రెండు పార్టులుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయా ? లేక చాలా గ్యాప్ తర్వాత వస్తాయా ? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.