హిమాన్షుకు అంతర్జాతీయ అవార్డు.. ఏం చేశారని అంటే ?
తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు హిమాన్షు. 15యేళ్ల వయసులోనే జాతీయ అవార్డుని అందుకోబోతున్నాడు. బ్రిటన్ నుంచి డయానా అవార్డు వచ్చింది. ఇంతకీ హిమాన్షు ఏం చేశాడని జాతీయ అవార్డు దక్కింది అంటే ? దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద 1999 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నారు. మానవీయ దృక్పథంతో, సమాజంలో మార్పుకోసం కృషి చేసినవారికి ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటారు. అది కూడా 9 నుండి 25యేళ్ల మధ్య ఉన్న వారికే ఇస్తారు.
ఇంతకీ హిమాన్షు చేసిన సమాజ సేవ ఏంటీ అంటే ? సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లోని రెండు గ్రామాల్లో కల్తీలేని ఆహార పదార్థాలు తయారుచేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించటం, వాటిని ప్రాసెసింగ్ చేయటం, ప్యాకింగ్ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఇందులో పనిచేసేవారిలో 50 శాతం మంది మహిళలే, ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్రాలకు పూర్తిగా సౌరవిద్యుత్తునే వాడుతున్నారు. అందుకే హిమాన్షుకు జాతీయ అవార్డు దక్కింది.