అక్కడ తిడితే.. ఇక్కడ సంగతి చూస్తాం !
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ మంత్రుల్ని.. వైఎస్‌ని తెలంగాణ మంత్రులు ఏ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. అయినా ఏపీ మంత్రులు ఏమాత్రం రెచ్చిపోబోవడం లేదు. సంయమనం పాటిస్తున్నారు. దీని వెనక ఆర్థిక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ మంత్రులు, ముఖ్య నేతలకు హైదరాబాద్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి. అధికారంలో లేకుంటే.. ప్రస్తుత వైసీపీ నేతలు ఉండేది హైదరాబాద్ లోనే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తిడితే.. అక్కడ రియాక్షన్ ఉంటుందనిభావిస్తున్నారట.
ఈ విషయాన్ని గుర్తు చేసి మరీ.. ఏపీ మంత్రులని తిట్టిపోస్తున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ‘హైదరాబాద్‌లో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. మంచిగా మాట్లాడాలి. ఇక్కడ తిని అక్కడ మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇక్కడ ప్రజలకు కోపం వస్తే ఆగమైపోతారు..” అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొడాలి నానికి నేరుగా హెచ్చరికలు పంపించారు.
ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకూ అదే వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి హెచ్చరికలు, బెదిరింపులు టీఆర్ ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ సమయంలో ఇవే వారి ఆయుధాలు. ఇప్పుడు అవసరం లేకున్నా.. అలాంటి ఆయుధాలని అప్పుడు వాడుతున్నారు. ఇప్పుడు జల వివాదంలోనూ ఆ ఆయుధాలని వినియోగిస్తున్నారు. ఏపీ మంత్రులని నోరు తెరవకుండా చేస్తున్నారు.