ఖేల్ రత్న కోసం అశ్విన్, మిథాలీ

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది.
ఇక అర్జున్ అవార్డుల కోసం పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను రికమండ్ చేశారు. భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును కూడా అర్జున్ అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించింది.