బిగ్ బాస్ మీద మోజు పెరిగింది

తెలుగు బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్లని పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. కరోనా విజృంభణ లేకుంటే ఈ పాటికే మొదలైపోయేది. గతంలో బిగ్ బాస్ కు ఎవరు వస్తారా? అని వెదికేవారు. కానీ బిగ్ బాస్ 4 తర్వాత పరిస్థితి మారింది. అరియానా, అవినాష్ లాంటి వాళ్లు బిగ్ బాస్ కు వెళ్లి సెలబ్రిటీలు అయిపోవడంతో.. ఇప్పుడు చిన్నా చితక యాక్టర్లంతా బిగ్ బాస్ వైపు చూస్తున్నారు. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో తమ పేరు వుండేలా కృషి చేస్తున్నారు. 

కండీషన్స్ అన్నింటికి ఓకే అన్నట్టుగా చిట్టి, పొట్టి డ్రెస్సులతో కనిపించే ప్రయత్నం చేస్తున్నారట. టిక్ టాక్ లో కాస్త పాపులర్ అయిన దుర్గారావు,  షార్ట్ ఫిలింల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ పేర్లు బిగ్ బాస్ 5 కోసం వినిపిస్తున్నాయి. ఈ సీజన్ కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.