‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరోడు
అల్లరి నరేష్ కేవలం కామెడీ హీరోనే కాదు. సీరియస్ పాత్రలని అద్భుతంగా పండించలడు. ఆ విషయం గమ్యం, శంభో శివ శంభో, నాంది సినిమాలతో రుజువైంది. నాంది సినిమా తర్వాత అల్లరోడి మళ్లీ కామెడీ సినిమాలు చేయొద్దని.. ఆయన అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు కానుకగా అల్లరోడు తన తదుపరి సినిమాని ప్రకటించారు.
తను హీరోగా చేస్తున్న 58వ చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకత్వం వహించనున్నారు. మహేష్ కోనేరు నిర్మాత. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘సభకు నమస్కారం’ టైటిల్ చూస్తే.. అలరోడ్డు మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వెళ్లినట్టు అనిపిస్తోంది.