పవన్’పై త్రివిక్రమ్ స్పెషల్ కేర్

పవన్ కల్యాణ్, రానా దగ్గుపాటి కథానాయకులుగా ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ మాస్ హీరోయిజం వుండదు. పవన్ నటనకు చాన్స్ మాత్రమే వుంటుంది అనుకున్నారు. కానీ పవన్ పై త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకున్నారట.

పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు యాక్షన్ పార్ట్ ని పెట్టారట. పవన్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను, అందులో అద్భుతమైన ఫైట్ ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ కు తోడుగా మరో మూడు భారీ ఫైట్లు సినిమాలో వుంటాయట. ఎమోషనల్ సినిమా అయిన అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో యాక్షన్ ని ఎలా వర్కవుట్ చేశారు ? అన్నది చూడాలి.