దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు..వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 48,786 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 6 శాతం పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు మరణాల సంఖ్య 817గా ఉంది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 3,04,11,634 మంది కరోనా సోకగా.. 3,99,459 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,23,257 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.77 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 61,588 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.94 కోట్ల మార్కును దాటాయి.