కేజీఎఫ్ 2 కూడా క్రిస్మస్ కే !

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్‌ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.  2018లో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-1’  విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ -2’ రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసమే ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్‌ 9న ‘కేజీఎఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదట. అన్ని సక్రమంగా ఉంటే అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని.. అలా కాని పక్షంలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారమ్.