రేవంత్ రెడ్డి ఖైదీ నెం.1799
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎటాక్ మొదలు పెట్టింది. రేవంత్ రెడ్డి ఖైదీ నంబర్ 1799. ఆయన త్వరలోనే మళ్లీ జైలుకు వెళ్తారని తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మళ్లు రవి కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే కాంగ్రెస్ లోకి వచ్చి.. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి బయటికి వచ్చిన నాయకుడేనని గుర్తు చేశారు. టీడీపీ నుంచి బయటికొచ్చాక.. కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీ పెట్టారు. దానికి అధ్యక్షుడు అయ్యాడు. అందరు కొట్లాడితే వచ్చిన ప్రత్యేక తెలంగాణకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని మల్లు రవి చెప్పుకొచ్చారు.