నయన్ పై సామ్ షాకింగ్ కామెంట్స్

విజయ్‌సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటిస్తున్న తమిళ చిత్రం “‘కాతువాకులా రెండు కాదల్‌”. ఈ సినిమాకు నయన్ ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమాలో ప్రియురాలు నయన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె ముందు సామ్ ని తక్కువ చేసి చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమా నుంచి సామ్ తప్పుకుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ అందులో నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. 

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తమిళ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ సినిమాలో విజయ్‌సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటిస్తోంది. వాళ్లిద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని వెల్లడించింది. ‘కాతువాకులా రెండు కాదల్‌’ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఆ సినిమాలో చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. విజయ్‌సేతుపతి, నయనతార తారాజువ్వల్లాంటి వాళ్లు” అంటూ పొగిడేసింది.