మరోసారి గొప్ప మనసు చాటుకున్న సంపూ
నటుడు సంపూర్నేష్ బాబుది మంచి మనసు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, ఇటీవల ఆకస్మిక మృతి చెందిన సినీ జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్ధిక సాయం సంపూర్ణేష్ అందించారు.
తాజాగా తల్లిదండ్రులని కోల్పోయిన ఇద్దరు కుమార్తెలకు అండగా నిలిచారు. స్నేహితులతో కలిసి ఆర్థిక సాయం అందించారు. ఈ సంఘటనపై సంపూ ఫేస్ బుక్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాకలో నరసింహచారి దంపతులు ఆత్మహత్య చేసుకున్న వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు.
తల్లిదండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను, మా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందించాం. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేమే చూసు కుంటామని వారికి మాట ఇచ్చాం. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం” అని ఆయన పేర్కొన్నారు.