ఏక్ మినీ కథ’తో మంచిరోజులు వచ్చాయ్ !

సినీ పరిశ్రమలో ఉన్న మేజిక్ అదే. ఒక్క సినిమా చాలు జీవితం మారిపోవడానికి. ‘ఏక్ మినీ కథ’ యంగ్ హీరో సంతోష్ శోభన్ తలరాతే మారిపోయింది. వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాను చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఇది కాక మరో సినిమాకు అదే హీరోను లాక్ చేసారు. అంటే.. యూవీలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు అన్నమాట.

అంతేకాదు.. సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేసేందుకు  స్వప్నదత్ యత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కూడా శోభన్ తో ఓ సినిమా చేయనుందట. ఆమె నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా ఇది. గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారంట. మొత్తానికి.. ఏక్ మినీ కథ సంతోష్ శోభన్ జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడీ.. ఈ హీరో చేతిలో ఏకంగా అరడజను సినిమాలున్నాయి.