ప్రభుత్వ భూముల వేలంపై రాముల్లమ్మ న్యాయపోరాటం
ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్ పై పదునైనా విమర్శణా బాణాలని ఎక్కుపెడుతుంటుంది భాజాపా మహిళా నేత విజయశాంతి. కానీ ఆమెని ట్విట్టర్ దాటి వచ్చి పోరాటం చేయాలని నెటిజన్స్ కోరుతున్నారు. వారి కోరికని రాములమ్మ తీర్చేందుకు రెడీ అయింది. బయటికొచ్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిధుల సమీకరణలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. వేలం ద్వారా భూములు విక్రయించేందుకు ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపేలా ఆదేశించాలని కోరారు. నిధుల కోసం రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరీ.. న్యాయ పోరాటంలో రాములమ్మ గెలుస్తుందా ? అన్నది చూడాలి.