ఆ ఫైర్ ఎటు పోయింది ?!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా టర్న్ తీసుకుంది. జలవిద్యుత్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు వరకు వెళ్లింది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ నేతలు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. ఏపీ నేతలు మాత్రం పిల్లుల్లా మారి.. రిక్వెస్టులతో సరిపెడుతున్నారు. వైకాపా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా కూడా తగ్గి మాట్లాడటం.. చేతులెత్తి దండాలు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గురువారం ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జల వివాదంపై స్పందీమ్చారు. కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. ఇక జల వివాదంలో గట్టిగా మాట్లాడకపోవడంపై సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మనవాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.